Tuesday, 3 November 2026

విదేశాలకు పంపిస్తా అని మోసం చేసిన శ్వేతా రెడ్డి

విదేశాలకు పంపిస్తా అని మోసం చేసిన శ్వేతా రెడ్డి
రాజంపేట్ జనంసాక్షిరాజంపేట్ మండల కేంద్రంలోని చెందిన ఆటో డ్రైవర్ దగ్గర నుండి హైదరాబాదుకు చెందిన ఒక మహిళ శ్వేతారెడ్డి వీసా కోసం డబ్బులు తీసుకొని మోసం చేసిన ఘటన ఆలస్యంగా రాజంపేట్ లో వెలుగులోకి వచ్చింది హైదరాబాద్ నగరానికి చెందిన ఒక మహిళ శ్వేతా రెడ్డి రాజంపేట్ గ్రామానికి చెందిన 11 మంది ఆటో డ్రైవర్ దగ్గర నుండి వీసా కోసం డబ్బులు తీసుకుంది విష 40 రోజుల్లో వస్తుందని చెప్పింది 9 మంది యువకులు దగ్గర 50 వేల చొప్పున ఇద్దరి దగ్గర 70 వేల రూపాయల చొప్పున డబ్బులు తీసుకుంది వీసా కోసం యువకుల సైతం ఎదురు చూడగా మాట దాట వేసింది గత ఆరు నెలలుగా వీసా రాకపోవడంతో యువకులు రాజంపేట్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు శ్వేతా రెడ్డి మంగళవారం రాజంపేట్ పోలీస్ స్టేషన్ వచ్చి రక్షణ కోరింది ఈ విషయంపై తెలుసుకున్న గ్రామ బాధితులు రాజంపేట్ పోలీస్ స్టేషన్ ముందు బాధితుడు ఆటో డ్రైవర్ నర్సింలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు పోలీసులు పోలీస్ సిబ్బంది వచ్చి బాధితులకు నచ్చచెప్పి సందయించారు శ్వేతా రెడ్డిని పోలీస్ స్టేషన్ నుండి బయటకు పంపవద్దని కోరారు స్థానిక ఎస్సై రాజు బాధితులకు నచ్చ చెప్పిన పట్టించుకోవడం లేదు బాధితులకు భారతీయ జనతా పార్టీ నాయకులు మద్దతు తెలిపారు రాజంపేట్ ఎస్సై రాజు ఏఎస్ఐ గంగారెడ్డి సీఐ తిరుపతి ఆధ్వర్యంలో బుధవారం మాట్లాడుదామని సందయించారు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు