Tuesday, 3 November 2026

బొగ్గు గని కార్మికుల 11వ వేతన సవరణ అలవెన్సులను  పూర్తి చేయకుంటే

 …బొగ్గు గని కార్మికుల 11వ వేతన సవరణ అలవెన్సులను  పూర్తి చేయకుంటే …బొగ్గు పరిశ్రమల్లో ఆందోళన ఉధృతం…….. బిఎమ్మెఎస్
—కెటీకె 1 ఇంక్లైన్ లో  సమస్యల సుడిగుండం…అండర్ గ్రౌండ్ బాయిల్లో అధికారుల నిర్లక్ష్యం వల్లనే…ప్రొడక్షన్ కు అంతరాయం…జెబిసిసిఐ సమావేశంలో బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్న  కార్మికులకు -11వ వేజ్ బోర్డు లో  19 శాతం మినిమం గ్యారెంటీ బెన్ఫిట్ మాత్రమే అంగీకారం కుదిరింది. మిగిలిన అన్ని అంశాలపై యాజమాన్యం ఈ నెల18 న కలకత్తా లో జరిగే సమావేశంలో  నిర్ణయం తీసుకోవాలని డిమాండ్  చేస్తున్నామని బిఎమ్మెస్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు అప్పని శ్రీనివాస్ పేర్కొన్నారు.       ఏప్రిల్ 2023 ముగింపు నాటికి బి‌ఎం‌ఎస్ యూనియన్  వెజ్ బోర్డు సమావేశా ఏర్పాటు కోసం తీవ్రంగా ప్రయత్నించింది. కానీ కోల్ ఇండియా మేనేజ్‌మెంట్‌లోని కొంతమంది ఉన్నతాధికారులు వాళ్లు నిర్దేశించుకున్న సంస్థకు సహాయం చేయడానికి ఫిబ్రవరి 10, 2023న కలకత్తా హైకోర్టు తీర్పు తర్వాత  కూడా వెజ్ బోర్డు (జేబీసీసీఐ )  యొక్క 9వ సమావేశాన్ని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారు. ఇంకా వెజ్ బోర్డు (జేబీసీసీఐ ) యొక్క అలవెన్సులు మరియు ఇతర అనేక సమస్యలు పైన చర్చించబడలేదు మరియు అంగీకరించబడలేదు.  వెజ్ బోర్డు సమావేశంలో అన్ని సంఘాల సమన్వయంతో బిఎమ్మెస్ 11వ వేతన వేతన సవరణ ఒప్పందాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి, ఆ తర్వాతే మంత్రిత్వ శాఖ ఆమోదానికి పంపాలని భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రయత్నిస్తోంది.
ఇదిలావుండగా, కొన్ని ఆన్‌లైన్ మరియు సోషల్ మీడియా గ్రూపులను నడుపుతున్న కొంత మంది అజ్ఞానులు, స్వార్థపరులుగా పిలువబడే  కొన్ని సంఘాలు 19 శాతం ఎంజిబి ఇంకా అమలు చేయలేదని బిఎమ్మెస్ పై తప్పుడు ప్రచారం చేస్తూ బొగ్గు కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారు.  11 వ వేతన పరిష్కారంలో మిగిలిన ఇతర అంశాలపై     ఇంకా ఏకాభిప్రాయం లేనప్పటికీ. అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం పంపబడుతుంది. ఇట్టి విషయంలో గతంలోకూడా వేతన సవరణ ఒప్పందంలోనూ అదే జరిగింది. కావున కార్మికులు అందరూ గమనించగలరు.
భారతీయ మజ్దూర్ సంఘ్ వెజ్ బోర్డు సమావేశాన్ని నిర్వహించేందుకు వెజ్ బోర్డు  (జేబీసీసీఐ -11)  సమావేశంలో బిఎమ్మెస్ , ఇతర అన్ని యూనియన్లతో సమన్వయం చేసి, కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని త్వరలో పూర్తి సెటిల్‌మెంట్‌ను ఖరారు చేసేలా కోల్ ఇండియా మేనేజ్‌మెంట్‌పై ఒత్తిడి తెవడం వల్లే ఈ నెల 18 న అలవెన్సులపై. మేనేజ్‌మెంట్  నిర్లక్ష్యం చేస్తే …బొగ్గు పరిశ్రమలో బిఎమ్మెస్ పోరాటం ఉదృతంగా ఉంటుంది.
అండర్ గ్రౌండ్ గనుల్లో అధికారుల నిర్లక్ష్యం వల్లే ఉత్పత్తికి అంతరాయం ….
భూపాలపల్లి ఏరియా అండర్ గ్రౌండ్ బొగ్గు బాయిల్లో అధికారుల నిర్లక్ష్యం వల్లే అండర్ గ్రౌండ్ లో బొగ్గు ఉత్పత్తి కి అంతరాయం జరుగుతుంది. ఎస్డిఎల్ యంత్రాలకు స్పెర్స్ (విడిబాగాలు ) అందుబాటులో లేకపోవడం…బొగ్గు  నింపటానికి ఖాళీలు సరిపడు లేకపోవడం…డిస్ట్రిక్ పని స్థలల్లో పనులు మెరుగు పర్చకపోవం… సాండ్ స్టావింగ్ ను సకాలంలో పూర్తి చేయకపోవడం.ప్రొడక్షన్  కోసం నూతన పని స్థలాలు సకాలంలో పూర్తి చేయక పోవడం వల్లే  అంతే కాకుండా మొత్తంగా కార్మికుల సమస్యలు పట్టించుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం .మూలంగా అండర్ గ్రౌండ్ మైన్స్ లలో బొగ్గు ఉత్పత్తిలో వేనకబడి ఉన్నాయి.
ఈ యొక్క సమావేశంలో ఓరం లక్ష్మణ్ పిట్ కార్యదర్శి. అన్నం శ్రీనివాస్.కె.భాస్కర్ అల్లం శ్రీనివాస్.లక్ పతి.ఓదెలు. కార్మికులు. కార్యకర్తలు పాల్గొన్నారు.