Wednesday, 4 November 2026

విద్యానగర్ సమస్యలను పరిష్కరించాలి

వరంగల్ ఈస్ట్, జూన్ 22 (జనం సాక్షి)వరంగల్ నగరంలోని 39 వ డివిజన్ విద్యానగర్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని స్థానిక కార్పొరేటర్ సిద్ధం రాజు తో పాటు మున్సిపల్ అధికారులను వరంగల్ జిల్లా సామాజిక న్యాయ వేదిక ప్రధాన కార్యదర్శి అచ్చ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు కోరారు. విద్యానగర్ స్ట్రీట్ వన్లో మిషన్ భగీరథ పైప్ లైన్లు ఇంటింటికి కనెక్షన్ ఇవ్వలేదు ఇప్పుడు కనెక్షన్ గురించి అడుగుతే సుమారు 6000 రూపాయలు ఖర్చవుతుంది అని తెలిపారు అంత ముందుకు మిషన్ భగీరథ కాంట్రాక్టర్ కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల ప్రజలపై భారం పడుతుంది అన్నారు తక్షణమే మిషన్ భగీరథ కనెక్షన్ ఇప్పించాలని కోరారు విద్యానగర్లో ముఖ్యంగా కరెంటు సమస్య అధికంగా ఉన్నది ఆ ట్రాన్స్పోర్ట్ తొలగించి లోడుగు దగ్గ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా దోమల బెడద డ్రైనేజీ సక్రమంగా తీయకపోవడం వల్ల దోమలు బెడద అధికంగా ఉన్నది అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా విద్యానగర్ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉప్పునూతల కుమార్ స్వామి లియాకత్ అలీ అబ్రవీణ సమ్మక్క సూర లచ్చమ్మ మరియు కాళివాసులు పాల్గొన్నారు