Wednesday, 4 November 2026

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నిర్వహిస్తున్న అమరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని శంకరంపేట ఆర్ మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి గారు అమరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ శేరీ సుభాష్ రెడ్డి గారికి డిఎస్పి యాదగిరి రెడ్డి,తాసిల్దార్ మహేందర్ గౌడ్, మండల బీఆరెస్ నాయకులు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లి తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలర్పించిన అమరవీరులకు ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల ఆశయాలు సాధిద్దాం అని ఎమ్మెల్సీ శేరి, ఇతర ప్రజాప్రతినిధులు నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజు అయిన ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడి ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళి అర్పించాలనే ఉద్దేశంతో ఈరోజు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్సీ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమరవీరులకు స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేసిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానిదే అని ఎమ్మెల్సీ అన్నారు. హైదరాబాదులో ఎక్కడైతే తెలంగాణ ఆస్తిత్వ చిహ్నమైన తెలంగాణ భవనాన్ని కూల్చివేశారో… ఆ స్థలంలోనే తెలంగాణ అమరుల స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసి అమరులకు ఘనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజమైన నివాళులు అర్పిస్తున్నదని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. మన దేశ పర్యాటకులు, విదేశీ పర్యాటకులు సందర్శించే విధంగా అత్యాధునికంగా స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల ప్రతి పేరును, వివరాలను ఈ అమరవీరుల చిహ్నంలో లిఖించడం జరిగిందని ఎమ్మెల్సీ వీరుల పేర్లను తెలిపారు. అలాంటి గొప్ప అమరవీరుల స్మారక చిహ్నాన్ని ఈరోజు సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేత ప్రారంభించడం జరుగుతున్నదని, ఈ ప్రారంభం తెలంగాణ అమరవీరులకు గొప్ప నివాళి అని ఎమ్మెల్సీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గారి వెంట స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి,కామారం ప్యాక్స్ చైర్మన్ అంజిరెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్,మండల నాయకులు సుధాకర్,మనోజ్,సిద్ది రాములు,బిక్షపతి (గుడ్డు) రమేష్ గౌడ్,లక్ష్మా గౌడ్,బాబు లింగం గౌడ్,ఎర్రి కుమార్, ఉపసర్పంచ్ జీవన్,యువ నాయకులు శ్రీను నాయక్,రమేష్ గౌడ్,సుధాకర్, డీఎస్పీ యాదగిరి రెడ్డి,సిఐ టాటా లక్ష్మీ బాబు, ఎస్సైలు సుభాష్ గౌడ్ ప్రకాష్ గౌడ్, ఎమ్మార్వో మహేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.