Tuesday, 3 November 2026

విద్యారంగానికి 30 శాతం నిధులు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి28 జ‌నంసాక్షి : కేజీ టూ పిజి ఉచిత విద్యాపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కనీసం వచ్చే విద్యాసంవత్సరం నుంచయినా ఈ పథకం అమలుకు చర్య తీసుకోవాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కె.ప్రేంకుమార్‌ డిమాండ్‌ చేశారు.  బ్జడెట్‌లో విద్యారంగానికి 30 శాతం నిధులను కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలకు ముందు విద్యార్థులకు అరచేతిలో స్వర్గం చూపించేలా హావిూలనిచ్చిన కేసీఆర్‌ అధికారంలోకి రాగానే వాటిని పూర్తిగా విస్మరించారని అన్నారు.  స్వరాష్ట్రంలో అధికారం చేపట్టిన తెరాస ప్రభుత్వం విద్యారంగాభివృద్ధికి శ్రద్ధ వహించకపోగా పూర్తిగా నాశనం చేసేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇచ్చిన హావిూమేరకు విద్యారంగం అభివృద్దికి నిధుల కేటాయింపు పెంచి చిత్తుశుద్దిని చాటుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *