గుంటూరు : ఇక మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది. ఈ విషయం గుంటూరు జిల్లా తెనాలి కోర్టు తీర్పుతో వెలుగుచూసింది. తెనాలిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఏడుగురు మందుబాబులకు రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఇలా జైలు శిక్షలతోనైనా డ్రంక్ అండ్ డ్రైవ్‌కు తెర పడుతుందని ఆశిద్దాం.




