హైదరాబాద్: అడిగిన ప్రశ్నకు సరైన జవాబు చెప్పలేదన్న కోపంతో ఓ ఉపాధ్యాయుడు పదేళ్ల బాలుడిని తీవ్రంగా కొట్టాడు. దీంతో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నవ్రాన్ గ్రామానికి చెందిన రామ్‌జీ అనే పదేళ్ల బాలుడు స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడు. మంగళవారం పాఠశాలకు వెళ్లిన రామ్‌జీని విజయ్‌రామ్ అనే ఉపాధ్యాయుడు కొన్ని ప్రశ్నలు అడిగాడు. రామ్‌జీ సరైన సమాధానం చెప్పకపోవడంతో విజయ్‌రామ్ అతన్ని తీవ్రంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన రామ్‌జీ ఆ తర్వాత కాసేపటికే మృతిచెందాడు. ఘటనపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించింది.




