సిర్పూర్ టి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు శుక్రవారం పోలీసులు మీకోసం భాగంలో జిల్లా ఎస్పీ సురేష్ కుమార్, కాగజ్నగర్ డిఎస్పి కరుణాకర్, కౌటాల సిఐ సాదిక్ పాషా, సిర్పూర్ టి ఎస్సై దీకొండ రమేష్,తరఫున పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పి సురేష్ కుమార్, మాట్లాడుతూ….. విద్యార్థులకు పరీక్ష సమయంలో నూతన ఉత్సాహం నింపిన వారవుతామని, విద్యార్థి దశ నుండి, ప్రతి ఒక్కరు సేవాభావం కలిగి, ఉండాలని విద్యార్థులందరూ చక్కగా చదువుకొని పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని “విద్యార్థి భవిష్యత్తుకు పునాది ఈ పదవ తరగతి” అని జీవితంలో అందరూ సేవాభావం కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంధ్యారాణి మాట్లాడుతూ.. సేవలను గుర్తు చేసుకుంటూ సమాజంలో మరిన్ని సేవా కార్యక్రమాలు మునుముందు మరెన్నో చేయాలని, విద్యార్థులకు పరీక్ష సమయంలో మీ సేవలు అందిస్తూ, నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. గతంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఇప్పటికి చేస్తూనే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారని, ముఖ్యంగా ఇప్పుడు పదో తరగతి పిల్లల మీద దృష్టి పెట్టి వారికి ఎగ్జామ్ ప్యాడ్స్ ఇవ్వడం చాలా సంతోషకరమైన, సిర్పూర్ టి ఎస్సై దీకొండ రమేష్ కి అభినందనలు తెలిపారు.





