Tuesday, 3 November 2026

విద్యార్థులకు ప్లేట్లు గ్లాసుల పంపిణీ

 జనంసాక్షి, మంథని : సహయ చారిటబుల్ ట్రస్ట్, యువ జనత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంథని మండలం లోని కన్నాల ప్రాధమిక పాఠశాల లో సహయా చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు తూము రవీందర్- ఉమాదేవి పెళ్లి రోజు, యువ జనత ఫౌండేషన్ చైర్మన్ బుద్ధర్తి నవీన్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు శనివారం ప్లేట్స్, గ్లాస్, నోట్ బుక్స్, పెన్స్ పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ ట్రస్ట్ అధ్యక్షులు మేడగొని వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ బొడ్డు సతీష్, కార్యదర్శి బుద్ధర్తి సతీష్ కోశాధికారి కొమురోజు సురేష్, డైరెక్టర్ పనకంటి రాజేష్, సభ్యులు ఐతు డేవిడ్, నన్నెగారి రాము, బుద్ధర్తి నాగరాజు, ఉపాధ్యాయురాలు రాధిక, సప్న, రఘుబాబు, ఎస్ఎంసి చైర్మన్ లత తదితరులు పాల్గొన్నారు.