రామ్ క్యా తండా గ్రామపంచాయతీ సిసి రోడ్ల పనులను ప్రారంభించిన జడ్పీటీసి మాలోతు ప్రియాంక

రఘునాథ పాలెం ఫిబ్రవరి 25(జనం సాక్షి) మండల రామ్ క్యా తండా గ్రామపంచాయతీ నందు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా శాంక్షన్ అయినటువంటి 35 లక్షల సీసీ రోడ్ల నిర్మాణమును మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశానుసారం, జడ్పిటిసి మాలోతు ప్రియాంక ప్రారంభించినారు, అలాగే మన ఊరు మన బడి లో భాగంగా సెలెక్ట్ అయినా యుపిహెచ్ రాంక్య తండ స్కూల్ ని సందర్శించి మధ్యాహ్నం భోజనం ను రుచి చూసారు అలాగే చదుపు పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించి హార్షం వ్యక్తం చేశారు తరువాత నర్సరీ ని సందర్శించారు ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ దారావత్ అమాలి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షైక్ అబ్జల్ ఆత్మ డైరెక్టర్ మాలోతు సంతు ,బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ సెక్రటరీ గుగులోత్ శ్రీనివాస్ , పంచాయతీ సెక్రటరీ గాంధి గ్రామ అధ్యక్షులు గుగులోత్ కోటేష్ కార్యదర్శి సొందుపాషా వార్డు సభ్యులు కేలోతు సరిత జాటోత్ బాబు హెచ్ యం జయరాజు , గ్రామ నాయకులు దారావత్ తారాచంద్ జాటోతు లచ్చు తదితరులు పాల్గొన్నారు