విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించేందుకు ప్రత్యేక చర్యలు-
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
కొమురం భీం జిల్లా: కాగజ్ నగర్ గ్రామీణం:
డిసెంబర్ 24(జనం సాక్షి)
విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలో ఈ నెల 28వ తేదీన ప్రారంభించనున్న ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అక్షరాస్యత శాతం పెంచడం ద్వారా దేశాభివృద్ధి జరుగుతుందని, ఈ క్రమంలో జిల్లాలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ మంజూరు చేసిందని తెలిపారు. స్కూల్ ప్రారంభ సమయానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు,ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు
విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించేందుకు ప్రత్యేక చర్యలు- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్




