Saturday, 7 November 2026

ధర్నాల పేరుతో మరో కొత్త డ్రామాకు తెరలేపిన టిఆర్ఎస్ నేతలు

ధర్నాల పేరుతో మరో కొత్త డ్రామాకు తెరలేపిన టిఆర్ఎస్ నేతలు
*టిపిసిసి నాయకులు జువ్వాడి కృష్ణారావు*
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 24, జనంసాక్షి :
రైతుల కల్లాలకు నిధులు ఇవ్వడం లేదంటూ జగిత్యాల జిల్లా కేంద్రంలో కోరుట్ల ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆ పార్టీకి చెందిన నాయకులతో కలసి జగిత్యాల జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించడం ఏమిటని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు జువాడి కృష్ణారావు కోరుట్ల ఎమ్మెల్యేను నిలదీశారు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వం ద్వారా ప్రజలకు పనులు చేయించాలి కానీ దానికి భిన్నంగా స్థానిక ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని జువ్వాడికృష్ణారావు అన్నారు ఈరోజు స్థానిక పత్రిక విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెలంగాణా లో టీఆరెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన 100 రోజుల్లో స్వాధీనం చేసుకుని ప్రభుత్వ రంగంలో నడిపిస్తామని హామీ ఇచ్చారని, దానికి భిన్నంగా ఆ ఫ్యాక్టరీని పూర్తిగా మూసివేసి ఆరు సంవత్సరాలు అవుతుందని మరి ఈ ఆరు సంవత్సరాల్లోఎమ్మెల్యే ఆ ఫ్యాక్టరీ ముందు ఎందుకు ధర్నా నిర్వహించలేదని కృష్ణారావు సూటిగా ప్రశ్నించారు అదే మాదిరిగా స్థానిక పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ పసుపు కు ప్రత్యేక బోర్డు తీసుకొస్తామని షుగర్ ఫ్యాక్టరీని తన సొంత నిధులతో నిర్వహిస్తానని చెప్పి బాండు కాగితం ద్వారా ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేశాడని తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలు కుమ్మక్కై ప్రజలను మభ్యపెట్టే విధంగా దొంగ నాటకాలు ఆడుతున్నారని గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీలా ఉందని బిజెపి టిఆర్ఎస్ ల వ్యవహారం జువ్వాడి కృష్ణారావు అన్నారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు స్థానిక పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు షుగర్ ఫ్యాక్టరీ ల విషయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేనిపక్షంలో టిఆర్ఎస్ బిజెపిలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని జువ్వాడి కృష్ణారావు అన్నారు