విద్యార్థులతో రాఖీ పండగ జరుపుకున్న పోలీసులు.
ఫొటో రైటప్: ఎస్సై రాజశేఖర్ కు మిఠాయి తినిపిస్తున్న విద్యార్థినీ.
బెల్లంపల్లి, ఆగస్టు12, (జనంసాక్షి) స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా రాఖీ పండగను పురస్కరించుకుని శుక్రవారం నెన్నెల ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు విద్యార్థుల సమక్షంలో రాఖీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నెన్నెల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల మరియు జంగల్ పేట ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి పోలీసులు రాఖీ వేడుకలు జరిపారు. ఈసందర్భంగా ఎస్సై రాజశేఖర్ మాట్లాడుతూ తోబుట్టువుల మధ్య అన్యోన్యతను ఇనుమడింపజేసే రక్షాబంధన్‌ను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ఈ పండుగ సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బంధం పటిష్టంగా ఉండాలని జరుపుకునే పండుగ అని వివరించారు. సోదర సోదరీమణులు ఒకరికి ఒకరు అండగా ఉంటామని భరోసా ఇచ్చే పండుగ , మానవ సంబంధాలకు, అనుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ అని పండుగ విశిష్టతను తెలియజేశారు. ఆడబిడ్డల రక్షణకు తెలంగాణ పోలిస్ నిరంతరం కృషి చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎస్సై రాజశేఖర్ మరియు పోలీస్ సిబ్బంది విద్యార్థినులతో రాఖీ కట్టించుకొని ఒకరికోఆరు స్వీట్స్ తినిపించుకున్నరు. ఈకార్యక్రమంలో పోలీసు సిబ్బంది మరియు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు