Tuesday, 3 November 2026

విద్యార్థులను అభినందించిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభినందించారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన యూనివర్సల్ ఫైటర్స్ కరాటే సెల్ఫ్ డిఫెండ్ అకాడమీ వారు నిర్వహించిన జూనియర్, సబ్ జూనియర్ కరాటే పోటీలలో మెడల్స్ సాధించిన విద్యార్థులు సోమవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిశారు.ఈ సందర్భంగా తాము సాధించిన మెడల్స్ గురించి వివరించి మంత్రి ఆశీస్సులు పొందారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ భవిష్యత్ లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాస్టర్ క్రాంతి , విద్యార్థులు సురుగు రామ్ చరణ్, దివ్యాంజలి, రోహిత్ , మనస్విని , నిషిత వాసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు