Tuesday, 3 November 2026

సుమన్ కాలనీలో సీసీ కెమెరాలను ప్రారంభించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సి.హెచ్ నేతాజీ

కంటోన్మెంట్ జనం సాక్షి మే 30 వెస్ట్ మారేడు పల్లి కంటోన్మెంట్ బోర్డ్ నాలుగో వార్డ్ పరిధిలోని సుమన్ కాలనీలో సోమవారం రాత్రి దివంగత ఎమ్మెల్యే సాయన్న కోట కింద సుమారు 5 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన ఆరు సీసీ కెమెరాలు సాయన్న కుమార్తెలు నివేదిత,లాస్య నందిత,ఇన్స్పెక్టర్ సి.హెచ్.నేతాజీ లతో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక సి సి కెమెరా100 మంది పోలీసులతో సమానమన్ని మారేడుపల్లి ఇన్స్పెక్టర్ సి.హెచ్.నేతాజీ అన్నారు.ఈ మేరకు
నేరాలనియంత్రణ,శాంతిభద్రతలు కాపాడేందుకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయి అన్నారు.స్టేషన్ పరిధిలోని కాలనీ బస్తీ వాసులు ప్రజలు ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.సీసీ కెమెరాలు ఏర్పాటుతో నిరాలను అదుపు చేయవచ్చునని దొంగతనాలు నివారించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు.రోడ్డు ప్రమాదాలు దొంగతనాలు తదితర ఘటనలు జరిగిన పరిస్థితుల్లో సీసీ కెమెరాలు ద్వారా వారిని గుర్తించి పట్టుకోవడానికి పోలీసులకు మూడో నేత్రముగా ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో పారిశ్రామిక వేత్త ప్రకాష్ రావు,నాయకులు సదానంద గౌడ్,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.