Monday, 2 November 2026

విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే క్రాంతికిరణ్

 

 

 

 

 

మునిపల్లి, ఏప్రిల్ 30, జనంసాక్షి: మండలంలోని బుదేరా డిగ్రీ కాలేజీ విద్యార్థులను అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పరామర్శించారు. ఫుడ్ పాయిజన్ తో హాస్పిటల్ లో చేరిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. తోటి విద్యార్థి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ ఇంటి నుంచి తెచ్చిన పాయసం తినడంతో 24 మంది గాను 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. ఇప్పటికే అందరు కోలుకున్నారని ఇవాళ, రేపు డిశ్చార్జ్ చేయనున్నట్లు డాక్టర్స్ తెలిపారు. హాస్టల్ లోని వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేయించి మంచి నీటితో పాటు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని రిజినల్ ఇంచార్జ్ భూమయ్యకు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సూచించారు.