మునిపల్లి, జనంసాక్షి: తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి (టిఆర్వీఎస్) రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జిగా మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పెద్దాపురం దేవేందర్ నియమితులయ్యారు. ఈ సందర్బంగా టిఆర్విఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మొహమ్మద్ మున్నా ఆదివారం నాడు మల్లేశంకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా దేవేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇస్తున్న సంక్షేమ పథకాలు, జీవోలు, దివ్యాంగుల సమస్యలు ఎప్పటికి అప్పుడు దివ్యాంగులకు తెలియ చేస్తానన్నారు. నాపై నమ్మకంతో సోషల్ మీడియా ఇంఛార్జిగా నియమించిన టిఆర్విఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ మున్నాకు, సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు షైక్ నయీమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంజనేయులు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.




