విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి..
– పాఠశాలలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్..
– పాఠశాల కరస్పాండెంట్ సామల బాలరాజు.
ఊరుకొండ, డిసెంబర్ 22 (జనంసాక్షి):
విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని.. చిన్ననాటి నుండి మంచి అలవాట్లు అలవర్చుకోవాలని పాఠశాల కరస్పాండెంట్ సామల బాలరాజు అన్నారు. గురువారం ఊరుకొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకట బాల్ రామయ్య హై స్కూల్ లో
గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ 100 రకాల వంటకాలు భిన్నమైన రుచులతో.. అలరించే వారికి నోరూరించే విధంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఊరుకొండ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షుడు, నవతెలంగాణ రిపోర్టర్ గువ్వ వరప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని.. మంచి పనులు చేయడం చిన్ననాటి నుండే నేర్చుకోవాలని.. మనం చేసే పని మనకు మన కుటుంబానికి.. సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. పాఠశాలలో ఎక్కడ కని విని ఎరుగని రీతిలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు
చదువుతోపాటు నిత్య జీవితంలో వారికి ఉపయోగపడే విధంగా వినూత్న కార్యక్రమాలు అర్థమయ్యే రీతిలో నిర్వహించడం హర్షదాయకం అని ఆయన అన్నారు. విద్యార్థులు రకరకాల వంటలు చేసి ఫుడ్ ఫెస్టివల్ ను పాఠశాల ఆవరణలో పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. కరస్పాండెంట్ తో పాటు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తెచ్చిన వంటకాలు రుచి చూసి.. అభినందించారు. ఫుడ్ ఫెస్టివల్ లో రకరకాల వంటకాలు తెచ్చిన ప్రతి విద్యార్థి గెలిచినట్లేనని ప్రతి ఒక్కరూ అభివర్ణించారు.
అనంతరం ఫుడ్ ఫెస్టివల్ లో చక్కటి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల డైరెక్టర్ గౌరవ శ్రీ సామల గీత, పాఠశాల ప్రిన్సిపాల్ తంగచెన్ లు బహుమతులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం మరియు యువకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి




