రైతులకు అండగా ఉంటాం డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి.
జనం సాక్షి ,డిసెంబర్22(భువనగిరి ఆర్.సీ)
రైతులకు అండగా ఉంటాం అని డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం భువనగిరి పట్టణం రాయగిరి లో త్రిబుల్ ఆర్ భూ సర్వే చేపట్టడానికి వచ్చిన అధికారులను అడ్డుకున్న భూ నిర్వాసిత రైతులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించిగా భువనగిరి టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో బొమ్మలారామారం పోలీస్ స్టేషన్ ల లో బాధిత రైతులను, నాయకులను కలిసి పరామర్శించి, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
నోటీసులు ఇవ్వకుండా, రైతుల సమక్షంలో చేయాల్సిన భూ సర్వే రైతుల అరెస్టు చేసి అధికారులు సర్వే చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధికారులపై మండిపడ్డారు. రైతులు విలువైన భూములు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ రాత్రికి రాత్రి దండోరా వేయించి అధికారులు భూ సర్వే చేస్తున్నారని, కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయగిరిలో రైతులు భూములు కోల్పోవడం ఇది నాలుగో సారి అని అన్నారు. దాదాపు 150 మందికి రైతులకు సంబంధించి 280 ఎకరాలు భూములు రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం పేరుతో కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. గత మూడు నాలుగు నెలలుగా ధర్నాలు చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరిలో త్రిబుల్ ఆర్ నిర్మాణం సర్వే లో భాగంగా ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్, తంగళ్ళపల్లి రవికుమార్, బర్రె జహంగీర్, యాదగిరి, ఆవేశతి కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.




