Wednesday, 4 November 2026

విద్యార్థులు ఇష్టపడి చదవాలి

విద్యార్థులు ఇష్టపడి చదవాలి

మోత్కూరు డిసెంబర్ 5 జనంసాక్షి : ప్రముఖ వ్యక్తిత్వ వికాసం శిక్షణ నిపుణులు జంగం శివ కుమార్ “విస్ డమ్ ఫౌండేషన్” ఆధ్వర్యంలో స్థానిక లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీషు మీడియం స్కూల్,కస్తూర్భా గాంధీ పాఠశాలల్లోని విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు రానున్న పదవ తరగతి పరీక్షల్లో 10 జి.పి.ఏ ఎలా సాధించాలో,ఒత్తిడిని ఎలా అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని ఎలా అందుకోవాలో విద్యార్థులకు వివరించారు. సెల్ ఫోన్ కి దూరంగా ఉంటూ, చదువు ని ప్రేమించాలని విద్యార్థులకు సూచించారు.ప్రతీ విద్యార్థి తల్లిదండ్రులని గౌరవించాలని, వారి కలల్ని నిజం చేయడానికి ఇష్టం తో చదవాలన్నారు.ఈ కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపాల్ ఓ.సత్యనాధ్,కె.జి.బి.వి ప్రిన్సిపాల్ సి.హెచ్ యాదమ్మ ,విస్ డమ్ ఫౌండేషన్ ఆర్గనైజర్స్ సూదగాని ఆంజనేయులు, ఎం.డి ఆరిఫ్ ఉపాధ్యాయులు కోమటి మత్స్యగిరి, పోలేపాక కృష్ణ, నిలిగొండ సైదులు, ఎం.డి రఫీ,రవి చందర్, ప్రతాప్,నర్సయ్య,వర్గీస్,శోభ తదితరులు పాల్గొన్నారు