Wednesday, 4 November 2026

విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి :రీజనల్ కో ఆర్డినేటర్ రజని

 

 

 

 

 

:శామీర్ పేట్, జనం సాక్షి :తెలంగాణ సాంఘిక సంక్షేమ కార్యక్రమాల జగద్గిరిగుట్ట శామీర్పేటలో డిగ్రీ మూడవ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు పార్టీ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రీజనల్ కోఆర్డినేటర్ రజిని డిస్టిక్ కోఆర్డినేటర్ సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..విద్యార్థులు తమ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగడానికి గురుకుల డిగ్రీ కళాశాలలు ఎంతో దోహదం చేస్తున్నాయని వారి ఉన్నత చదువులకు కూడా డిగ్రీ కళాశాలల కృషి ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇష్రత్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శోభారాణి, అధ్యాపక విద్యార్థి బృందం, తదితరులు పాల్గొన్నారు.