తూప్రాన్ మే 9( జనం సాక్షి) ::: తూప్రాన్ కు చెందిన వెంకటేష్ కు అనారోగ్యంతో బాధపడుతుండగా ఆపరేషన్ చికిత్స నిమిత్తం మంత్రి హరీష్ రావు కృషితో రెండున్నర లక్షల ఎల్ వో సి ని తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమ్స్ ఆసుపత్రిలో ఆపరేషన్‌కు రెండు లక్షల అవుతుందని నిమ్స్ వైద్య బృందం తెలపడంతో మంత్రి హరీష్ రావు కృషి వల్ల అతనికి రెండున్నర లక్షల ఎల్ఓసి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇప్పించినట్లు ఆయన తెలిపారు వెంకటేష్ మంత్రి హరీష్ రావుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు




