Thursday, 5 November 2026

విద్యార్థులు ఎలాంటి వత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి.

విద్యార్థులు ఎలాంటి వత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి.వాసవి వనిత క్లబ్ అధ్యక్షులు చిగులపల్లి జ్యోతి రమణ కుమార్.పదవతరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్, పెన్నులు బహుకరణ.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,మార్చి18(జనంసాక్షి): నాగర్ కర్నూల్ మండలం మంతటి గగ్గలపల్లి గ్రామాలలోని జెడ్పి  ఉన్నత పాఠశాలలో వాసవి క్లబ్ పూర్వ అధ్యక్షులు వాసా రాఘవేందర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో 10వ తరగతి చదువుతున్న బాల బాలికలకు ఎగ్జామ్ ప్యాడ్స్,పెన్నులు బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా వాసవి వనిత క్లబ్ అధ్యక్షులు చిగులపల్లి జ్యోతి రమణ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన వాతావరణం లో పరీక్షలు రాయాలని అప్పుడే మంచి మార్కులు సాధించగలరని అన్నారు. మొదటగా పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన విద్యార్థులు ప్రశ్నాపత్రం మొత్తం పరిశీలన చేసిన తర్వాత వచ్చిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చిన తర్వాత ప్రశాంతమైన వాతావరణం లో ఆలోచించినప్పుడు మిగిలిన ప్రశ్నలకు కూడా సమాధానం దొరుకుతాయని అన్నారు.కాబట్టి విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణం లో పరీక్షలు రాయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.