Monday, 2 November 2026

విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి.

 

 

 

 

 

 

 

 

 

మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్ 29విద్యార్థులు చదువును కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ప్రో బెల్స్గార్డెన్ పాఠశాల నిర్వాహకులు శ్రీధర్ పేర్కొన్నారు. 2022- 23 సంవత్సరంలో చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శనివారం బహుమతులను ప్రధానం చేసి అభినందించారు.ఈసందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.తమ పాఠశాలలో విద్యార్థులకు అన్ని రంగాలలో ప్రతిభ కనబరిచేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి అవసరమైన తీరులో విద్యనందిస్తామని తెలిపారు. చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నేర్పిస్తామని తెలిపారు.చదువుని సులభ పద్ధతిలో నేర్పిస్తూ విద్యార్థుల మానసిక వికాసానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.