Wednesday, 4 November 2026

విద్యార్థులు లక్ష్యాలకు అనుగుణంగా విద్యను అభ్యసించాలి

కారేపల్లి జనం సాక్షి మార్చి9
విద్యార్థులు తాను ఎందుకు నన్ను లక్ష్యాలకు అనుగుణంగా విద్యను అభ్యసించాలని కోట మైసమ్మ ఆలయ, పరస ఆనంత రామయ్య ట్రస్ట్ చైర్మన్ వరుస పట్టాభిరామారావు అన్నారు. గురువారం కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన క్రీడా సాంస్కృతిక వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మీటర్ కోట సింహాచలం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు నిరంతరం ఇష్టపడుతూ చదివితే తమ లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చు అన్నారు. కళాశాలకు 25 వేల రూపాయల స్టడీ మెటీరియల్ విరాళంగా అందజేయడం సంతోషకరంగా ఉందని వచ్చే సంవత్సరం మరింత ఉన్నతంగా విద్యార్థులకు విరాళాన్ని అందజేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కారేపల్లి వ్యాపారవేత్త సురేష్ బూబ్ మంజుల దంపతులు కళాశాలలోని స్పోర్ట్స్ కు సంబంధించిన బహుమతుల విరాళాలు అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో సైతం ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సింహాచలం మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థుల కోసం విరాళం అందజేసిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రతి సంవత్సరం తమ సహాయ సహకారాలు విద్యార్థులకు ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు