హుజూర్ నగర్ మార్చి 9 (జనం సాక్షి): అంతర్జాతీయ మహిళా దినోత్సవన్ని పురస్కరించుకొని పట్టణానికి చెందిన శ్రీ అన్నమయ్య భజన మండలి గౌరవ అధ్యక్షురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భజన పుస్తకాల ముద్రిత సాహితీ వేత్త జీవిత సాఫల్య పురస్కార అవార్డు గ్రహీత గుండా సుశీలమ్మ ను గురువారం హుజూర్ నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన రవి, వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు సుభాషిని, కందిబండ వాసవి ఘనంగా ఆమెను సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ అర్చనరవి మాట్లాడుతూ సుశీలమ్మ సమాజానికి సాయితీ రంగానికి, భజన రంగానికి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని వారి సేవలను గుర్తించి నేడు వారిని సత్కరించుకోవడం ఎంతో ఆనందదాయకమని అన్నారు.
ఘనంగా సుశీలమ్మకు సన్మానం




