శామీర్ పేట్, జనం సాక్షి :మంగళవారం
రోజు తూముకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్థానిక వార్డ్ కౌన్సిలర్ బి రాజు యాదవ్ ఉచిత పాఠ్యపుస్తకాలు ఉచిత ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు . ఈ సందర్భంగా రాజ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉచిత సౌకర్యాలను వినియోగించుకొని విద్యారంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు వెంకటేశం , మేరీ, నాగ శారద, తిరుమలేష్, అన్నపూర్ణ అమీనా, రజిని ,వరలక్ష్మి ,శ్రీదేవి శ్వేత ,మంజుల ,శైలజ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : తుంకుంట 5వ వార్డు కౌన్సిలర్ రాజు యాదవ్




