రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, మే10(జనంసాక్షి):-అనుమతి అర్హత లేకుండా యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న శ్రీనిధి,గురునానక్ యూనివర్సిటీలో గుర్తింపును రద్దు చేయాలని ,4000 మంది విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థుల పక్షాన పోరాడుతున్న వందలాదిమంది ఏబీవీపీ విద్యార్థి నాయకుల పైన అక్రమంగా కేసులు బనాయించి నలుగురు విద్యార్థి నాయకులను రిమాండ్ కి పంపించారని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ మాట్లాడుతూ 4000 మంది విద్యార్థుల జీవితాలను , అనుమతి లేకుండా అడ్మిషన్స్ తీసుకొని యూనివర్సిటీని నడుపుతున్న యూనివర్సిటీ యాజమాన్యం పైన,యూనివర్సిటీ అర్హతకై రికమండ్ చేసిన ఇన్స్పెక్షన్ కమిటీ పైన ,హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారుల పైన మరియు యూనివర్సిటీ కి ఉండవలసిన నిబంధనలకు విరుద్ధంగా యూనివర్సిటీని నడిపిస్తున్న యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని,4000 మంది విద్యార్థుల జీవితాలకు విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించాలని విద్యార్థుల పక్షాన న్యాయబద్ధంగా పోరాడుతున్న ఏబీవీపీ విద్యార్థి నాయకులు గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రెటరీ శ్రీకాంత్, వీరపట్నం జిల్లా కన్వీనర్ , స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కృష్ణ , ఎగ్జిక్యూటివ్ మెంబర్ సందీప్ లను రోజు రిమాండ్ కు తరలించడం జరిగిందని అన్నారు.విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని తీర్చలేని చేతకాని రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ ఫండింగ్ లకు అమ్ముడుపోయి ప్రైవేటు యూనివర్సిటీలకు తొత్తులుగా మారి విద్యార్థితో వ్యాపారం చేయడమే కాకుండా వేల మంది విద్యార్థులకు అన్యాయం చేస్తూ, విద్యార్థులకు న్యాయం చేయాలని పోరాడుతున్న ఏబీవీపీ విద్యార్థి నాయకులను రిమాండ్ కు తరలించడానికి ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది అన్నారు.మీరు అక్రమ కేసులు బనాయించి రిమాండ్ కు పంపించినంతమాత్రాన ఏబీవీపీ వెనకడుగు వేయదు ఈ ప్రభుత్వం మెడలు వంచైనా విద్యార్థులకు న్యాయం జరిగే వరకి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడుతూనే ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు




