Tuesday, 3 November 2026

విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్ – సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

జనం సాక్షి , కమాన్ పూర్ : విద్యా రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట ఇస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం గుండారం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా రూ. 21.56 లక్షలతో పూర్తి చేసిన ఆధునీకరణ పనులను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ బోర్లకుంట వెంకటేష్, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ప్రారంభించారు.