Tuesday, 3 November 2026

విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కదం తొక్కిన విద్యార్థులు. కలెక్టర్ కార్యాలయం ముట్టడి.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జూన్ 26. (జనంసాక్షి). విద్యారంగం లోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కదం తొక్కారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ముట్టడించి ఆందోళన నిర్వహించారు. విద్యా రంగ సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంద అనిల్, మల్లారపు ప్రశాంత్ లు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ లు అందుబాటులోకి రాలేదని అన్నారు. విద్యా రంగంలో నెలకొన్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం అతనపు కలెక్టర్ , ఖిమ్యానాయక్ కు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు కరుణాకర్, కళ్యాణ్, మనోజ్, రాకేష్, ఆదిత్య పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.