Tuesday, 3 November 2026

ఏబీవీపీ బంద్ విజయవంతం.

దౌల్తాబాద్ జూన్ 26, జనం సాక్షి.మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో బంద్ విజయవంతం అయింది.ఈ సందర్బంగా ఏబీవీపీ నాయకులు పంజాల స్వామి గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని,రాష్ట్రంలో మూసివేసిన 8624 ప్రభుత్వ పాఠశాలలను పునర్ ప్రారంభించి విద్యావ్యవస్థను ప్రటిష్ఠ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ స్కూల్లో అధిక పీసులు వసూలు చేస్తూన్న యాజమాన్యాలపై తగు చర్యలు తీసుకొని గుర్తింపు లేకుండా నడిపిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు, వేణు తదితరులు పాల్గొన్నారు