ప్రీపెయిడ్ విూటర్ల అమరికకు కసరత్తు
తీరనున్న మొడిబకాయిల భారం
సెల్‌ఫోన్ మాదిరిగా రీచార్జ్ సౌకర్యం
రీఛార్జ్ మేరకు విద్యుత్ సరఫరా
హైదరాబాద్,జూలై11(జనం సాక్షి): ప్రీపెయిడ్ విద్యుత్ విూటర్లను బిగించేందుకు తెలంగాణ విద్యుత్ శాఖ కసరత్తు చేస్తోంది. సెల్ ఫోన్ రీచార్జ్‌ల మాదిరిగానే ఇకపై విద్యుత్ విూటర్లను రీచార్జ్ చే యించుకోవాల్సి ఉంటుంది. అందుబాటులోనున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నష్టాలను కొంత మేరకైనా తగ్గించుకునేందుకు విద్యుత్ శాఖ చర్యలు చేపట్టింది. అందుకోసం డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి ప్రీపెయిడ్ విూటర్లను ఏర్పాటు చేశారు. పై లట్ ప్రాజెక్టుగా మొదటగా ప్రభుత్వ కార్యాలయాల్లో త్రీఫేజ్, సింగిల్ ఫేజ్ ప్రీపెయిడ్ విద్యుత్ విూటర్లను అమర్చనున్నారు. త్రీఫేజ్ విూటర్‌కు రూ.10వేలు నుంచి రూ.12వేల వరకు, సింగి ల్ ఫేజ్ విూటర్‌కు రూ.2వేల నుంచి రూ.4వేల వరకు ఖర్చవు తుంది. ఇదివరకు ఉన్న పాత పోస్ట్‌పెయిడ్ విూటర్‌ను తొలగించి వాటి స్థానంలో విద్యుత్‌శాఖ ప్రీపెయిడ్ విూటర్లను అమర్చుతారు. కావాల్సినన్ని ప్రీపెయిడ్ విూటర్లు జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయానికి చేరవేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అమర్చడం పూర్తయిన తర్వాత గృహాలలో అమర్చేందుకు ఆ సంస్థ సిద్ధమవుతుంది. వినియోగిదారులు ముందస్తుగా ఎంత రీచార్జి చేసుకుంటే అంతే విద్యుత్‌ను ఉపయోగించు కునేలా ఈ ప్రీపెయిడ్ విూటర్ల అమర్చనున్నారు. ఈ విూటర్ల ద్వారా ఒక రోజు వినియోగించే విద్యుత్‌కు ఎంత ఖర్చు చేస్తు న్నారో విూటర్‌లోకి అంకెల ద్వారా తెలుసుకోవచ్చును. ఈ వి ధానంతో వినియోగదారులు పొదుపుగా విద్యుత్‌ను వినియో గించనున్నారు. వీటితో పాటు విద్యుత్ బకాయిలు కూడా నివా రించబడతాయి. అంతేకాకుండా విద్యుత్ బిల్లుల వసూలు కోసం ప్రత్యేక సిబ్బంది, బిల్లుల చెల్లింపు కేంద్రాల అవసరం ఇకపై ఉండదు. మొదటగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ విూ టర్లను అమర్చనున్నారు. వాటి పని తీరును పరిశీలించిన తరు వాత లోటుపాట్లను సరిచేసి ప్రతి చోట ప్రీపెయిడ్ విూటర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విూటర్లను జీనస్ పవ ర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా సరఫరా చేస్తున్నారు. ఐదేళ్ల పాటు ప్రీపెయిడ్ విూటర్లు ఈ కంపెనీ వారెంటీ ఇచ్చింది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ నూతన విధానంతో ఇకపై మొండి బకాయిల సమస్యలు తప్పనున్నాయి.
ప్రీపెయిడ్ విూటర్ల ద్వారా వినియోగదారులు పొదుపుగా విద్యుత్‌ను వినియోగించుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం వివిధ కార్యాలయాల్లో ఇష్టానుసారంగా విద్యుత్ వాడుతున్న వారు కాస్త అదుపులోకి రానున్నారు. కొన్ని కార్యాలయాల్లో అవసరం ఉన్నా లేకపోయినా ఫ్యాన్లు, ఏసీలు పనిచేస్తూనే ఉంటాయి. ఈ నిర్లక్ష్యంతో
విద్యుత్ బిల్లులు ప్రతి నెల రూ.వేలల్లో నమోదు అ వుతుంటాయి. ఈ భారం మొత్తం తిరిగి ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రీపెయిడ్ విూటర్ల వల్ల చాలా వరకు విద్యుత్ ఆదా కానుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అమర్చిన అనంతరం వాటిలోని లోటుపాట్లను సరిచేసుకుని కమర్షియల్, ¬మ్ పర్పస్‌లో కూడా ప్రీపెయిడ్ విద్యుత్ విూట ర్లను త్వరలోనే అమర్చనున్నారు. ప్రీపెయిడ్ విద్యుత్ విూటర్ ద్వారా ముందుగా ఎన్ని డబ్బులతో రీచార్జ్ చేస్తే అంతే మొత్తంలో విద్యుత్ అందనుంది. విద్యుత్ విూటర్ల రీచార్జ్ కోసం వినియోగదారులు టీఎస్ ఎస్పీడీసీఎల్ యాప్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ఈ యాప్‌లో రూ.100 నుంచి రీచార్జ్ కార్డులు అందుబాటులో ఉంటాయి. వాటి ద్వారా యాప్ సూచనల ప్రకారం రీచార్జ్ చేసుకోవాలి. రీచార్జ్ చేసు కున్నందుకు టచ్ స్కీన్ర్ ద్వారా నెంబర్ బోర్డును కూడా పొందుపరిచారు. ఎప్పటికప్పుడు ఎంత విద్యుత్‌ని వినియోగించుకున్నారు, ఎంత మొత్తంలో డబ్బులు ఉన్నాయి, రోజు ఎంత ఖర్చు అవుతుందన్న సమాచారం ప్రీపెయిడ్ విూటర్‌కు అదనంగా అందించిన బోర్డు ద్వారా
తెలుసుకోవచ్చు. విూటర్‌లో డబ్బులు అయిపోయే సందర్భంలో మూడు రోజుల ముందుగానే బోర్డులో బల్బ్ వెలుగుతూ అలారం మోగుతుంది. అప్పుడు వినియోగదారులు వెంటనే రీచార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. విూటర్‌లో రీచార్జ్ డబ్బులు అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు విద్యుత్ నిలిపివేయకుండా ఉంటుంది. ఆ తర్వాత కూడా రీచార్జ్ చే యకపోతే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఈ నూతన విధానంతో బిల్లుల ఎగవేత బకాయిలు పేరుకుపోవడం వంటి సమస్యలు ఉండవు. ఎప్పటికప్పుడు ముందస్తు చెల్లింపుతో విద్యుత్‌ను సరఫరా చేసే అవకాశం ఉంది. ఈ పక్రియతో విద్యుత్ శాఖకు లాభం చేకూరనుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మొదట ఈ విూటర్లను జీనస్ కంపెనీ అమర్చుతుంది. అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటైన ఈ విూటర్ల వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇకపై రీచార్జ్ ద్వారా విద్యుత్‌ను వినియోగించుకోవాల్సి వస్తుంది.
——-




