హైదరాబాద్ : తెరాస ఎమ్మెల్యే కేటీఆర్, రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం, భాజపా ఎమ్మెల్యే నాగం జనార్ధన్రెడ్డిలను పోలీసులు విద్యుత్సౌధలోకి అనుమతించారు. తొలుత ధర్నా చేసేందుకు యత్నించిన వీరిని పోలీసులు అరెస్టు చేశారు. తాము ధర్నా చేయడానికి రాలేదని, ట్రాన్స్కో సీఎండీని కలిసేందుకే వచ్చామని చెప్పడంతో వారిని పోలీసులు లోపలికి అనుమతించారు.




