Tuesday, 3 November 2026

టీజేఏసీ మహాధర్నా, నేతలు అరెస్టు

హైదరాబాద్‌, (జనంసాక్షి): హైదరాబాద్‌ ఖైతరాబాద్‌ విద్యుత్‌ సౌధ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణవాదుల అరెస్టులను నిరసిస్తూ విద్యుత్‌ సౌధ వద్ద తెలంగాణ జేఏసీ మహాధర్నాకు పిలుపునిచ్చింది. మహాధర్నాలో పాల్గొన్న జేఏసీ కన్వీనర్‌ కోదండరామ్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌, బీజేపీ నేత నాగం జనార్ధన్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. విద్యుత్‌ జేఏసీ నేత రఘు సహా పలువురు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల తీరును కేటీఆర్‌ ఖండించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *