Wednesday, 4 November 2026

విద్యుత్‌ కోతలు నిరసిస్తూ రాస్తారోకో

చేగుంట: మెదక్‌జిల్లా చేగుంట మండలం నారసింగిలో విద్యుత్‌కోతలు నిరసిస్తూ రైతులు 44వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వారం రోజులుగా వ్యవసాయానికి రెండు, మూడు గంటల పాటే విద్యుత్‌ సరఫరా చేస్తున్నారని అగ్రహం చెందిన రైతులు ఈరోజు ఉదయం ఆందోళన బాటపట్టారు. సక్రమంగా విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. రాస్తారోకోతో జాతీయ రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *