హైదరాబాద్ : విద్యుత్ బిల్లులు తగ్గాలంటే ప్రజలు వినియోగం తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం సర్‌చార్జీలను విధించడంపై ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు. రాష్ట్రంలో జలవిద్యుత్ పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభమైతే సర్‌చార్జీల బెడద ఉండదన్నారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్లపై మార్చివరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆ తరువాత ఎలాంటి విధానం అమలు చేయాలనే అంశంపై కేంద్రం ఆలోచిస్తుందని పేర్కొన్నారు.




