Thursday, 5 November 2026

విద్యుత్‌ సౌధ ముట్టడిలో బీజేపీ నేతలు అరెస్టు

హైదరాబాద్‌ : విద్యుత్‌ కోతలు, సర్‌ఛార్జీల పెంపునకు నిరసనగా మంగళవారం బీజేపీ ఆందోళనకు దిగింది. విద్యుల్‌ కోతలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్‌ల ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు విద్యుత్‌ సౌధను ముట్టడించేందుకు యత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యుత్‌ సౌధను ముట్టడించేందుకు యత్నించిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. విద్యుత్‌ కోతలను నిరసనగా రాష్ట్రవ్యాప్తంగ ధర్నాలు నిర్వహించాలని బీజేపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *