Tuesday, 3 November 2026

:విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి :భోజన విరామ సమయంలో నిరసన….

మిర్యాలగూడ, జనం సాక్షి.మిర్యాలగూడ విద్యుత్ కార్యాలయం ఎదుట గురువారం అధికారులు సిబ్బంది, మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.విద్యుత్ శాఖ పిఆర్సి జేఏసీ            మిర్యాలగూడ విద్యుత్ శాఖ డివిజన్ పిఆర్సి జేఏసీ నాయకులు విద్యుత్ బిసి సంఘం రాష్ట్ర నాయకులు మారం శ్రీనివాస్ 1104 యూనియన్ డివిజన్ అధ్యక్షులు కాతోజు సోమచారి, 327 యూనియన్ డివిజన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నాయకులు అశోక్, రాజేశ్వర రావులు మాట్లాడుతూ మన డిమాండ్స్ నెరవేరేవరకు ఉద్యమాన్ని రెట్టింపు ఉత్సాహంతో కొనసాగించాలని, తెలంగాణ రాష్ట్ర పిఆర్సి జేఏసీ పిలుపుమేరకు విద్యుత్ కార్యాలయంఎదుట,జనరేటింగ్ స్టేషన్ల వద్ద, మార్చి 3,4 తేదీలలో సర్కిల్ ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్ జనరేటింగ్ స్టేషన్ల వద్ద లంచ్ అవర్ డెమోనిస్ట్రేషన్ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి స్థానిక మిర్యాలగూడ డివిజన్ నాయకత్వాలు పూర్తిస్థాయిలో రేపు నల్గొండ సర్కిల్ ఆఫీస్ లో జరుగు నిరసన కార్యక్రమానికి ప్రతి ఒక్క ఉద్యోగులు రావడానికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో  ఎఈలు, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, కిషన్ లాల్, రవీందర్ రెడ్డి, ఉద్యోగులు, కార్మికులు, మహిళా ఉద్యోగులు శివరామకృష్ణ, షఫీ ఖాన్, శ్రీనివాస్, సురేష్, భాస్కర్, నరసింహ, వీరభద్రం, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, కృష్ణారెడ్డి, విజయ శేఖర్, కోటేశ్వరరావు, చిరంజీవి, మురళీమోహన్, హేమేందర్, తాజోద్దీన్, హనుమాన్ నాయక్, గౌసుమియా, శ్రీరాములు, పాండు, సంతోష్, పర్వతాలు, ఇమ్రాన్ ఖాన్, రవీందర్, రషీద్ భాయ్, రామ్మూర్తి, గోపికృష్ణ, మనోహర్, ఇక్బాల్, శ్రీనయ్య, బిక్షం, సురేష్, దామోదర్, నాగమణి, ఝాన్సీ, పద్మ, అంజు ఫాతిమా, సుగుణమ్మ, అనసూర్య, ప్రమీల, జరీనా, భార్గవి, కవిత, ఫాతిమా, ఉద్యోగుల భారీ ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.