ప్రీతి హత్య అత్యంత దుర్మార్గం *మహిళల రక్షణ చట్టాల అమలులో పాలకుల విఫలం*నేరస్తులను శిక్షించి న్యాయం చేయాలి
టేకులపల్లి, మార్చి 2( జనం సాక్షి ): కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ వేదింపులతో మృతి చెందినా మెడికల్ విద్యార్థి ప్రీతి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, కారకుడైన సైప్ ని కఠినంగా శిక్షించాలని మండల పరిధిలోని మొక్కంపాడు తండా గ్రామ పెద్దలు,యూత్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ప్రీతికి సంతాప నిర్వహించి, కొవొత్తులతో ర్యాలీ నిర్వహించి రెండు నిముషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ విజయవాలు నాయక్,ఉపసర్పంచ్ మాలోత్ రాందాస్,బానోత్ రవి ,భూక్యా సుభాష్ నాయక్ అజ్మీర రవి, మాలోత్ నరేష్, బానోత్ దేవల, మొక్కంపాడు పంచాయతీ గ్రామ యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ ప్రీతి మృతి పట్ల కొవ్వొత్తులతో ఘన నివాళి




