మల్కాజిగిరి.జనంసాక్షి.మే24.అసలే ఎండాకాలం ఉక్కపోత నిమిషం కరెంటు లేకుంటే ప్రజలు అల్లాడిపోతున్నారు.ఆనంద్ భాగ్ సబ్ స్టేషన్ విద్యుత్ అధికారులు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ఫీడర్ మరమ్మతులు చేయాలని మూడు గంటలు విద్యుత్ నిలిపివేయాలని ఉన్న తాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఉన్నతాధికారులు అనుమతి ఇవ్వడంతో ఈవిషయాన్ని మీడియా ద్వారా విద్యుత్ అధికారులు ప్రజలకు సమాచారం అందించారు.మూడు గంటలు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని ఉన్నతాధికారులకు,మీడియాకు తప్పుడు సమాచారం అందించి ఉదయం 9 గంటలకు విద్యుత్తు తొలగించి సాయంత్రం నాలుగు గంటలకు సప్లై ఇచ్చారని స్థానికులు వాపోతున్నారు.మే 20న కూడా ఉన్నతాధికారులతో మూడు గంటలు అనుమతి తీసుకొని సాయంత్రం 6 గంటలకు సప్లై ఇచ్చారని,ఉదయం నుండి సాయంత్రం వరకు కరెంటు లేకపోవడంతో ఫ్యాన్లు లేక ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యామని వాడుకోవడానికి నీళ్ళు లేక నానా అవస్థలు పడ్డామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మీడియాకు, ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం అందించి ఉదయం నుండి సాయంత్రం వరకు విద్యుత్ నిలిపివేసిన అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.




