నెన్నెల, మే 24, (జనంసాక్షి )
నకిలీ విత్తనాలు, నాసిరకంఅమ్మితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నెన్నెల ఎస్సై శ్యాం పటేల్ హెచ్చరించారు. బుధవారం ఆయన మండలంలోని ఎరువులు, ఫర్టిలైజర్స్ షాపులలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి, గోదాం లో నిల్వ ఉన్న విత్తనాలను పరిశీలించారు. షాప్ లో స్టాక్ మరియు సెల్ వివరాలు, రిజిస్టర్, బిల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు నకిలీ విత్తనాలు నాసిరకం ఎరువులు ఎవరు అమ్మరాదని, ఎవరైనా అమ్మితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రైతులకు అమ్మే ప్రతి విత్తనాలు, ఎరువులకు బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు నాసిరకం ఎరువులు ఎవరైనా అమ్మిన, సరఫరా చేసిన, కొనుగోలు చేసిన ఏటువంటి సమాచారం తెలిసిన స్థానిక పోలీస్ అధికారులకు లేదా డయల్ 100 కి కాల్ చేసి పోలీసువారికి సమాచారం ఇవ్వాలన్నారు. ఇట్టి తనిఖీల్లో మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ కుమార్, వ్యవసాయ శాఖ సిబ్బంది, పోలీసు సిబ్బంది ఉన్నారు.
నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు అమ్మితే చట్టప్రకారం కఠిన చర్యలుతప్పవు. – నెన్నెల ఎస్సై శ్యామ్ పటేల్.




