వికారాబాద్ రూరల్ మే 16 జనం సాక్షి వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని మీర్జాపురం (శేరిగుడం) గ్రామానికి చెందిన మంగ సుక్కయ్య s/o రామయ్య ఈదుడుగాలుల తో కూడిన వర్షం రావడంతో. విద్యుత్ స్తంభం నుండి తీగ తెగి పడి మీర్జాపురం గ్రామానికి చెందిన మంగ సుక్కయ్య తండ్రి రామయ్య గేదె విద్యుత్ షాక్ తో మృతి చెందింది.ఈ గేదే అంచనా విలువ రూపాయలు 42000 పాడి గేదె చనిపోవడంతో రైతు కన్నీరు మున్నీరయ్యాడు.విధ్యుత్ అధికారులు స్పందించి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని బాధితులు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు.




