రంగారెడ్డి: విద్యుత్ షాక్తో ప్రధానోపాధ్యాయురాలు మృతి చెందింది. ఈ ప్రమాదం పూడూరు మండలం మేడికొండ పాఠశాలలో పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ప్రభావతి అనే ప్రధానోపధ్యాయురాలు మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




