హైదరాబాద్: ‘హైదరాబాద్‌లో మేం కలవం. మా జిల్లాను కలపొద్దు’ అంటూ రంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధులు తిరుగు బావుటా ఎగరేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను కలిపి మూడు జిల్లాలు చేయాలనే ప్రతిపాదనపై రంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధులంతా కలిసికట్టుగా నిరసన వ్యక్తం చేశారు. దీనికి సాక్షా త్తూ అధికార పార్టీకి చెందిన మంత్రి మహేందర్‌రెడ్డి నాయకత్వం వహించి జిల్లాలపై అభిప్రాయ సేకరణ భేటీ లో వేడి పుట్టించారు. నిజానికి, వికారాబాద్ కేం ద్రంగా రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయాలని, జిల్లాలో మిగిలిన 9 నియోజకవర్గాలను కలిపి హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలోనే, జిల్లాలపై అభిప్రాయ సేకరణలో భాగ ంగా శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రివర్గ ఉపసంఘం ఉదయం 10 గంటల నుంచి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సంయుక్తంగా భేటీ నిర్వహించింది. ప్రభుత్వ ప్రతిపాదనలపై ఇరు జిల్లాల ప్రజా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తొలుత వారి అభిప్రాయాలే తీసుకోవాలని నిర్ణయించింది. అయినా, ‘ఇతర జిల్లాలన్నిటికీ విడివిడిగా.. హైదరాబాద్, రంగారెడ్డిలకు కలిపి సమావేశం పెడతారా’ అంటూ మంత్రి మహేందర్‌రెడ్డి నేతృత్వంలోని ఎమ్మెల్యేలంతా సమావేశాన్ని బహిష్కరించారు. దాంతో, మహేందర్‌రెడ్డిని మంత్రివర్గ ఉపసంఘం సముదాయించి.. నచ్చచెప్పింది. రంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధులంతా బయటికి రావడమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్‌తో కలిసి భేటీ కాబోమని ప్రకటించడంతో వారిని పక్కన ఉన్న సమావేశ మందిరంలో కూర్చోబెట్టారు. తొలుత హైదరాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలు సేకరించారు. రంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధులంతా తొలినుంచీ ఇదే అభిప్రాయంతో ఉండటం.. అధికార పార్టీవారే అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో మంత్రులు కంగుతిన్నారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయొద్దుహైదరాబాద్ జిల్లాను యథావిధిగా కొనసాగించినా.. సికింద్రాబాద్, హైదరాబాద్ జిల్లాలుగా వేరు చేసినా.. రంగారెడ్డి జిల్లా ప్రాంతాలను కూడా కలిపి మూడు జిల్లాలు చేసినా తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అక్బరుద్దీన ఒవైసీ(మజ్లి్‌స)తోపాటు కిషనరెడ్డి (బీజేపీ), మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్(టీఆర్‌ఎస్) తదితరులు స్పష్టం చేశారు. అయితే, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా పునర్వ్యవస్థీకరణ చేయాలని,గ్రేటర్ హైదరాబాద్‌ను జిల్లా చేసే ప్రతిపాదనలు పరిశీలించాలని కిషన రెడ్డి ప్రతిపాదించారు. రంగారెడ్డి జిల్లా యూనిట్‌గానే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయాలని, వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేసి, సైబరాబాద్ వెస్ట్, ఈస్ట్ కమిషనరేట్‌లాగా మరో రెండు జిల్లాలు చేయాలని, లేకపోతే, రంగారెడ్డి (గ్రామీణం), రంగారెడ్డి (పట్టణం) పేరిట రెండు జిల్లాలు ఏర్పాటు చేయాలని మంత్రి మహేందర్ రెడ్డితోపాటు ఎమ్మెల్సీ జనార్దన రెడ్డి, ఎమ్మెల్యేలు ఎనవీఎ్‌సఎ్‌స ప్రభాకర్, వివేకానంద్ , మలిపెద్ది సుఽధీర్‌రెడ్డి కోరారు. వికారాబాద్ జిల్లాలోకి కొడంగల్ నియోజకవర్గాన్ని కూడా కలపాలని సూచించారు. కాగా, దేశంలో అతి పెద్ద పారిశ్రామిక ప్రాంతం రామగుండంను ప్రత్యేక జిల్లాగా చేయాలని కాంగ్రెస్ శాసనసభపక్ష ఉప నేత జీవనరెడ్డి, ఆర్టీసీ చైర్మన సోమారపు సత్యనారాయణ, ఎంపీ బాల్క సుమన డిమాండ్ చేశారు. శాసీ్త్రయంగా విభజన జరిగితే జిల్లాకు ఉండాల్సిన లక్షణాలన్నీ రామగుండంకు ఉన్నాయని, దానిని జిల్లా కేంద్రంగా మార్చకపోతే మంచిర్యాలలోనైనా రామగుండంను కలపాలని సోమారపు సత్యనారాయణ ప్రతిపాదించారు. దేశానికి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిని అందించిన మంథనిని పీవీ పేరుతో జిల్లా చేయాలని మంథని ఎమ్మెల్యే పుట్ట మధు కోరారు. కాగా, ఖమ్మం జిల్లా ఏడు మండలాలను పోగొట్టుకుని నష్టపోయిందని, తమను ఇంకా ఇబ్బంది పెట్టవద్దని ఆ జిల్లా ప్రజా ప్రతినిధులు కోరారు.




