ఏటూరునాగారం(జనం సాక్షి),మే 05.ఏటూరునాగారం మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన రైతు శ్రీరామ్ నరేష్ కి చెందిన పాడి గేదె ఉదయం పూట పాలు పితికి మేత కోసం విడిచిపెట్టగా రోడ్డు పక్కన ఉన్న బురద నీటి తాగడానికి వెళ్ళిన క్రమంలో మెయిన్ లైన్ లోని న్యూటల్ వైర్ తెగి గేదె మీద పడగ సంఘటన స్థలంలోనే చనిపోయింది. పాలు అమ్ముకొని జీవనం సాగిస్తున్న పాడిగేదే విలువ సుమారు 90 వేళా రూపాయలు ఉంటుందని. విద్యుత్ శాఖ అధికారులు,ప్రభుత్వం తరపున ఆదుకొని సహాయం చెయ్యాలని రైతు కోరుతున్నాడు.అలాగే పాత కరెంట్ తీగలు తెగిపోవడం వలన 1976 సంవత్సరం లో ఏర్పాటు చేసిన విద్యుత్ కరెంటు లైన్లు స్తంభాలు కావడం వలనే గ్రామములో తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని,గ్రామస్తులు పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులు దృష్టికి తీసుకెళ్లిన స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఘటన మరల పునరావృతం కాకుండా కొత్త విద్యుత్ లైన్లు,స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.




