అసెంబ్లీ నుంచి సభ్యుల వాకౌట్.. మండిపడ్డ మంత్రి హరీష్
హైదరాబాద్,మార్చి9(జనంసాక్షి): వెల్‌లోకి వచ్చిన టిడిపి సభ్యులను బ్జడెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయడం సరికాదని తెలంగాణ శాసనసభలో భాజపా పక్షనేత లక్ష్మణ్ అన్నారు. శాసనసభలో లక్ష్మణ్ మాట్లాడుతూ… తెదేపా సభ్యుల సస్పెన్షన్‌పై పునరాలోచించాలని కోరారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… క్షమాపణ చెప్పేందుకు స్పీకర్ పలుమార్లు అవకాశం ఇచ్చినా … పట్టించకోకుండా మళ్లీ ఆందోళనకు దిగడంతోనే సస్పెండ్ చేయాల్సి వచ్చిందని వివరించారు. ఇది కేవలం విపక్షం వారిపై చర్య తీసుకునేదిగా ఉందని ఆయన మండిపడ్డారు. జాతీయగీతాన్ని అవమానించటం సరికాదని భాజపా శాసనసభాపక్షనేత లక్ష్మణ్ అన్నారు. జాతీయగీతాన్ని అవమానించిన సభ్యులు క్షమాపణ చెప్పాలని సూచించారు. తెదేపా సభ్యులను సస్పెండ్ చేయడం సమంజసం కాదని, పునఃపరిశీలించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. గవర్నర్ ప్రసంగంపై ఆరూరి రమేశ్ ధన్యవాద చర్చ
చేపడతుతున్న దశలో లక్ష్మణ్ మరోమారు ఈ అంశపై మాట్లాడుతూ అధికార పార్టీ సభ్యలుపై చర్య ఎందుకఉ తీసుకోలేదన్నారు. కావాలనే విపక్షసభ్యలుపై చర్య తీసుకున్నారని అన్నారు. శాసనసభలో పక్షపాత ధోరణి చూపిస్తున్నారని.. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయడం సరికాదని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ సభలో పేర్కొన్నారు. అందుకు నిరసనగా వౌకటౌ/- చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. టీడీపీ, బీజేపీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. లక్ష్మణ్ వ్యాఖ్యలపై హరీష్‌రావు స్పందించారు. టీడీపీ, బీజేపీ రెండు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఆ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రాద్ధాంతం చేస్తున్నాయి. టీ బ్రేక్ కంటే ముందు లక్ష్మణ్ ఐదు నిమిషాలు సభలో మాట్లాడారు. టీడీపీ సభ్యుల సస్పెండ్ టీ బ్రేక్ అయిన అనంతరమే టీడీపీ సభ్యుల సస్పెండ్ గుర్తొచ్చిందా? అంటే టీ విరామ సమయంలో అక్కడి నుంచి ఏదో సమాచారం అందింటది.. అందుకే ఆ అంశాన్ని మళ్లీ ఇప్పుడు లేవనెత్తారు. లక్ష్మణ్ రాజకీయ దురుద్దేశానికి పాల్పడుతున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే అవసరం తమకు లేదని మంత్రి స్పష్టం చేశారు.




