Thursday, 5 November 2026

విభజన చట్టాన్ని ఏపీ ఉల్లంఘిస్తుంది: హరీష్

AP violation the Partition Act

హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తుందని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. శాసనమండలి సమావేశంలో భాగంగా మంత్రి విద్యుత్ సమస్యకు సమాధానంగా మాట్లాడుతూ… ఏపీ ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన కరెంట్‌ను వాడుకుంటున్నది. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వానికి లేఖలు రాసినం. అయినా పట్టించుకోకుండా మొత్తం కరెంట్‌ను వాడుకుని తెలంగాణకు అన్యాయం చేస్తుంది. ఈ విషయంపై కేంద్రానికి ఇప్పటికే లేఖలు రాసినం. విద్యుత్ విషయంలో తెలంగాణ టీడీపీ నేతలు నోరు మెదపడం లేదు. సీఏఈపై కోర్టుకు వెళ్లనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా టీడీపీ నేతల బహిష్కరణపై స్పందిస్తూ.. జాతీయగీతాన్ని గీతాన్ని గౌరవించలేని సంస్కృతి టీడీపీ నేతలది. జాతీయగీతంపై మాకున్న గౌరవాన్ని కాపాడేందుకే వారిని సస్పెండ్ చేసినమని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *