Thursday, 5 November 2026

విలాసాగర్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ త్రిలింగ సంఘ మేశ్వర ఆలయంలో సహస్ర దీపోత్సవం

విలాసాగర్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ త్రిలింగ సంఘ మేశ్వర ఆలయంలో సహస్ర దీపోత్సవం
బోయిన్ పల్లి నవంబర్ 20 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం విలాసాగర్ గ్రామంలో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంకాలం సహస్ర దీపోత్సవ కార్యక్రమం శ్రీశ్రీశ్రీశ్రీ త్రిసంఘమేశ్వర ఆలయం, విలాసాగర్‌లో ఘనంగా జరిగింది. దీపోత్సవ కార్యక్రమంలో సర్పంచ్ జూలపెల్లి స్వప్న అంజన్ రావు పాల్గొని మా విలాసాగర్ గ్రామంలోని సహస్ర దీపోత్సవం సందర్భంగా మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు మాట్లాడుతూ మాసంలో అత్యంత పవిత్రమైన మాసమని, దీపారాధన చేస్తే సర్వ అరిష్టాలు మై సుఖసంతోషాలు కలుగుతాయి అందుకే ప్రతి గ్రామంలో మైవేముల దూరవాడ ట్రస్ట్ ఆధ్వర్యంలో దీపారాధన కార్యక్రమాలను నిర్వహిస్తామని గ్రామ ప్రజలకు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మధు మహేష్, గొంగళ్ళ రవికుమార్, పురాణం శ్యామ్ ప్రసాద్ శర్మ, గొండ ప్రసాద్, రత్నంపేట దిలీప్, మధు కవిత, గొంగళ్ళ శ్రీదేవి, చంద్రగిరి స్రవంతి, గోపన్నగారి నీరజ, ప్రతాప వనజ, గోపన్నగారి చంద్రకళ, ప్రతాప శ్రీచందన, గోపన్నగారి సరిత, మాదాడి వేణుగోపాల్ రావు, మామిడాల శ్రీనివాస్, గంప సత్తయ్య, పడమా టిబూ సత్తయ్య, ఆర్. ఎం.పి. రాజేశం మరియూ ప్రజలు దీపోత్సవం కార్యక్రమంలో గ్రామంలో ఉత్సాహంగా పాల్గొని భక్తిని చాటుకున్నారు.