విలేకరి ఆకస్మిక మృతి ఎమ్మెల్యే మైనంపల్లి లక్ష రూపాయల ఆర్థిక సహాయం


మల్కాజిగిరి,ఆగస్ట్‌18(జనంసాక్షి):మల్కాజిగిరి సీనియర్ ఆంధ్రజ్యోతి విలేకరి రామకృష్ణ బుధవారం రాత్రి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వెంటనే ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం వారి కుటుంబ సబ్యులకు 1లక్ష రూపాయల
ఆర్థిక సహాయాన్ని అందజేశారు.వారి తో పాటు ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ కార్పొరేటర్ ప్రేమ్ కుమార్,20 వెల  రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.పలువురు స్థానిక జర్నలిస్టులు,రాష్ట్ర నాయకులు రామకృష్ణ పార్థివ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జితేంద్ర నాథ్,మైనంపల్లి శివాంక్ బాబు, పరశురాం రెడ్డి, పిట్ల శ్రీనివాస్, సతిష్ కుమార్,రాముయాదవ్,గుండా నిరంజన్,ఉపేందర్ రెడ్డి,బాబు, సత్యనారాయణ,ఎస్ ఆర్ ప్రసాద్,చెన్నారెడ్డి,ఇబ్రహీం, జర్నలిస్టులు సునిల్ రెడ్డి,బాల్ రాజు, మోహన్ రావు,లవకుమార్ గౌడ్,సంగమేష్,బాలాజీ,శ్రీకాంత్, శివ,బికె యాదవ్,అక్కల రాజు,లక్ష్మరెడ్డి రాయుడు,తదితరులు పాల్గొన్నారు.