Thursday, 5 November 2026

వివేశన స్థలాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలి

వివేశన స్థలాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలి.

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్.

రాజన్న సిరిసిల్ల. డిసెంబర్ 5. (జనంసాక్షి) సిరిసిల్ల ప్రాంతంలో నిరుపేదలకు ఇచ్చిన నివేశన స్థలాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలనీ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. హక్కులు కల్పించాలని కోరుతూ బీ వై.నగర్ గోల్డెన్ టెంపుల్ వద్ద జరుగుతున్న నిరసన దీక్షలు సోమవారం రెండో రోజుకు చేరుకున్నాయి. దీక్షలను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ నివేశన స్థలాలకు రిజిస్ట్రేషన్ సౌకర్యం లేకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రభుత్వం ఇచ్చిన నివేశన స్థలాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు పంతం రవి, మోర రవి, రామకృష్ణ, కొండ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.